80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించే గౌరవం దక్కడం గర్వంగా, భావోద్వేగంగా ఉందని బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయం లో జాతీయ జెండా ఎగురావేసిన అనంతరం జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. వారి త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సారథ్యంలో దేశం అభివృద్ధి, మౌలిక వసతులు, సాంకేతికత, ఆత్మనిర్భరత, జాతీయ భద్రత రంగాల్లో వేగంగా ముందుకు సాగుతోందన్నారు. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు.
వివిధ మోర్చాలా నాయకులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు



