రాజన్న సిరిసిల్ల ఆగస్టు 15 ( పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్ గురుకుల పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ ఉదయ్ కుమార్, పేరెంట్స్ కమిటీ అధ్యక్షుడు రాజలింగం, వైస్ ప్రిన్సిపాల్ పేరెంట్ కమిటీ సభ్యులు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఆటల పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు . అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేసి వేడుకలను ముగించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.



