రాజన్న సిరిసిల్ల ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి )
ముస్తాబాద్ మండల కేంద్రంలోని సెస్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ మండల అధ్యక్షులు
బొంపెల్లి సురేందర్రావు బి ఆర్ ఎస్ నాయకులు, పార్టీ కుటుంబ సభ్యులు, సెస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


