విశాఖపట్నం, ఆగస్టు 15 (పున్నమి ప్రతినిధి): జీవీఎంసీ 4వ వార్డు మంగమారిపేట జెడ్.పీ.హెచ్. స్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులకు వారి గొప్పతనాన్ని వివరించారు. జాతీయగీతం ఆలపిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సమరయోధుల త్యాగాలకు గుర్తుగా మొక్కలు నాటారు. ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి, స్కూల్ చైర్మన్ అమ్మాజీ, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు, శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం బోర్డు మెంబర్ గరికిన కింగ్, మాజీ ఎంపీటీసీ సభ్యులు వాసుపల్లి ఎల్లయ్య, బీఎల్‌ఏలు దూడ రమేష్, దౌవలపల్లి ఎల్లారావు, తెలుగు యువత ఉపాధ్యక్షులు వాసుపల్లి మారాజు, చవ్వాకుల కనకరాజు, గరికిన ఎల్లాజీ, వాసుపల్లి నరేంద్ర, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జై హింద్! జై భారత్! 🇮🇳
– పున్నమి న్యూస్ ప్రతినిధి




