Monday, 17 August 2026
  • Home  
  • పీఎం శ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు
- తిరుపతి

పీఎం శ్రీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

చిట్వేల్: చిట్వేల్ మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కమిటీ చైర్మన్ శివశంకర్ రాజు, మండల విద్యాశాఖ అధికారులు కాజా మొయిద్దీన్, ఈశ్వరయ్య, టీడీపీ సీనియర్ నేత లారీ సుబ్బరాయుడు, ఎస్‌ఐ వినోద్‌కుమార్, దాత జనార్ధనరావు, ప్రధానోపాధ్యాయులు బాలరాజు దుర్గరాజు తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన, ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జాతీయ జెండాకు వందనం చేశారు. ఎన్‌సీసీ అధికారి పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎన్‌సీసీ విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక పరేడ్‌ను ముఖ్య అతిథులు వీక్షించి అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బాలరాజు దుర్గరాజు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులకు క్రీడా పోటీలు, వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. 2026-27 సంవత్సరంలో జాతీయ స్థాయి, తల సైనిక్ క్యాంపుల్లో ఫైరింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచిన ఉత్తమ ఎన్‌సీసీ క్యాడెట్లకు దాత జనార్ధనరావు (జానీ) మెమంటోలు అందజేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుభాష్ చంద్రబోస్, విజయలక్ష్మి, సోఫియా, కళావతి, సుహాసిని, నవీన్‌కుమార్, శివనారాయణగౌడ్, వెంకటరమణ, నాగలక్ష్మి, వెంకటేష్, ఈశ్వరరాజు, రమాదేవి, చెన్నయ్య, ఎన్‌సీసీ అధికారులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

చిట్వేల్: చిట్వేల్ మండలంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కమిటీ చైర్మన్ శివశంకర్ రాజు, మండల విద్యాశాఖ అధికారులు కాజా మొయిద్దీన్, ఈశ్వరయ్య, టీడీపీ సీనియర్ నేత లారీ సుబ్బరాయుడు, ఎస్‌ఐ వినోద్‌కుమార్, దాత జనార్ధనరావు, ప్రధానోపాధ్యాయులు బాలరాజు దుర్గరాజు తదితరులు పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలన, ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జాతీయ జెండాకు వందనం చేశారు. ఎన్‌సీసీ అధికారి పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎన్‌సీసీ విద్యార్థులు నిర్వహించిన ప్రత్యేక పరేడ్‌ను ముఖ్య అతిథులు వీక్షించి అభినందించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు బాలరాజు దుర్గరాజు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని, వారి త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
విద్యార్థులకు క్రీడా పోటీలు, వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. 2026-27 సంవత్సరంలో జాతీయ స్థాయి, తల సైనిక్ క్యాంపుల్లో ఫైరింగ్ విభాగంలో ప్రతిభ కనబరిచిన ఉత్తమ ఎన్‌సీసీ క్యాడెట్లకు దాత జనార్ధనరావు (జానీ) మెమంటోలు అందజేశారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు సుభాష్ చంద్రబోస్, విజయలక్ష్మి, సోఫియా, కళావతి, సుహాసిని, నవీన్‌కుమార్, శివనారాయణగౌడ్, వెంకటరమణ, నాగలక్ష్మి, వెంకటేష్, ఈశ్వరరాజు, రమాదేవి, చెన్నయ్య, ఎన్‌సీసీ అధికారులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.