పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జాతీయ పతాకావిష్కరణ – ప్రభుత్వ భవనాలు విద్యుత్ దీపాలతో కళకళ
విజయనగరం జిల్లా బ్యూరో /రమణ, ఆగస్టు 14. (పున్నమి ప్రతినిధి)
విజయనగరం, జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శనివారం ఉదయం 9 గంటలకు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేయడంతో పాటు విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ శాఖల శకటాలు, అభివృద్ధి స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్. దామోదర్‌తో కలిసి వేడుకల ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్‌తో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.



