శ్రీ కాళహస్తి, ఆగస్టు 14, (పున్నమి న్యూస్): ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న రామ్‌లీలా మైదాన ప్రాంతాన్ని ఎన్డీఏ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో గంగాజలంతో శుద్ధి చేయడాన్ని ఖండిస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వినతిపత్రం అందజేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ.. ఖర్గే పాల్గొన్న సమావేశ ప్రాంతాన్ని గంగాజలంతో శుద్ధి చేయడం దళితుల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా చూపిన కుల వివక్షకు, అంటరానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. దళితులు, వెనుకబడిన వర్గాల వారు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు కరీముల్లా, శ్రీకాళహస్తి మండలం అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండలం అధ్యక్షుడు రాహుల్ రాయల్, పట్టణ యువజన అధ్యక్షుడు ఆంటోనీ, కేకేసీ నియోజకవర్గ అధ్యక్షుడు ఫక్రూదీన్, నాగరాజు, మహేష్, దిలీప్, వెంకటరత్నం, మాస్, చరణ్, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.

ఖర్గే పట్ల కుల వివక్షకు నిరసన-శ్రీకాళహస్తిలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన