శ్రీ కాళహస్తి, ఆగస్టు 14, (పున్నమి న్యూస్): దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ ఏపీ సీడ్స్ నుంచి చారిత్రాత్మక నాలుగు మాడ వీధుల గుండా ఉత్సాహంగా సాగింది. వేలాది బైకులు, త్రివర్ణ పతాకాలతో పురవీధులన్నీ మువ్వన్నెల శోభను సంతరించుకున్నాయి. అనంతరం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో పూర్తయిన పలు కీలక అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. గేట్ నెం-1 వద్ద శ్రీ, కాళ, హస్తి, భక్త కన్నప్పల దివ్య చరిత్రను ప్రతిబింబించే వర్ణచిత్రాలు, ఆహ్లాదకరమైన వాటర్‌ఫాల్స్, రాహు-కేతు పూజా సామగ్రి ప్రత్యేక ప్యాకింగ్ విభాగం, గేట్ నెం-3 బ్రిడ్జి వద్ద స్వామి-అమ్మవార్ల ప్రతిరూపాలతో నూతన ప్రవేశ ప్రాంగణం, దాతల సౌకర్యార్థం డోనర్ సెల్ గదిని అందుబాటులోకి తెచ్చారు. గతంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హెలికాప్టర్ ద్వారా కొండపై విత్తనాలు చల్లగా, నేడు ఆధునిక డ్రోన్ టెక్నాలజీతో కొండ చుట్టూ 3 లక్షల విత్తన బంతులను వెదజల్లే పర్యావరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఆలయ ఈవో, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్, పాలకమండలి సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో వైభవంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, పలు అభివృద్ధి పనుల ప్రారంభం