ఓబులవారిపల్లి: మండలంలోని ఓబులవారిపల్లిలో నూకపాపుగారి బాబుల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యుల ఆహ్వానం మేరకు వారి మనవరాలి పుట్టివెంట్రుకల కార్యక్రమానికి రైల్వేకోడూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, కుడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారిని ఆశీర్వదించి, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులతో ముక్కా రూపానందరెడ్డి ఆప్యాయంగా ముచ్చటించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



