శ్రీ కాళహస్తి, ఆగస్టు 13, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలోని గాంధీ వీధికి చెందిన వంశీ కాలేజీ విద్యార్థిని నిత్య రాష్ట్రస్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి రెండు పతకాలతో సత్తా చాటింది. తిరుపతిలో నిర్వహించిన ఏపీ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అండర్–18 బాలికల విభాగంలో పాల్గొన్న ఆమె, డిస్కస్ త్రోలో స్వర్ణ పతకం, షాట్‌పుట్‌లో రజత పతకం సాధించి రికార్డు సృష్టించింది. ఈ టోర్నీలో రెండు వేర్వేరు విభాగాలలో పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారిణిగా నిత్య నిలవడం విశేషం. శ్రీకాళహస్తి ఫిట్నెస్ సెంటర్ అధినేత జ్యోతిరావు, రూపాదేవి దంపతుల కుమార్తె అయిన నిత్య, ఈ విజయంతో వచ్చే సెప్టెంబర్‌లో పుదుచ్చేరిలో జరగనున్న జూనియర్ సౌత్ నేషనల్ అథ్లెటిక్స్ (జాతీయ స్థాయి) పోటీలకు ఎంపికైంది. తమ కుమార్తె క్రీడా ప్రతిభకు తిరుపతి జిల్లా శాప్ (SAP) అధ్యక్షులు కిషోర్ అన్ని విధాలుగా సహకారం అందించారని, అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని నిత్య తల్లిదండ్రులు పేర్కొన్నారు. నిత్య సాధించిన ఈ అసాధారణ విజయంపై కుటుంబ సభ్యులు, కళాశాల అధ్యాపకులు, పట్టణ క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. రాబోయే జాతీయ స్థాయి పోటీల్లోనూ ఆమె మరిన్ని పతకాలు సాధించి పట్టణానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని పలువురు ఆకాంక్షించారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో శ్రీకాళహస్తి విద్యార్థిని నిత్యకు రెండు పతకాలు-జాతీయ పోటీలకు ఎంపిక