Thursday, 13 August 2026
  • Home  
  • పుల్లంపేట : అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ
- తిరుపతి

పుల్లంపేట : అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణ

పుల్లంపేట మండలంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌లో అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సీడీపీఓ ఎస్. రేణుక ఆధ్వర్యంలో ఈ నెల 11 నుంచి 13 వరకు మూడు రోజులపాటు శిక్షణ కొనసాగుతోంది. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన బోధన అందించేందుకు ఉపయోగించే టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ (టీఎల్‌ఎం)పై శిక్షణలో ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. టీఎల్‌ఎంను బోధనా ప్రక్రియలో ఎలా ఉపయోగించాలి, చిన్నారుల్లో ఆసక్తిని పెంచేలా బోధనను ఎలా కొనసాగించాలనే అంశాలను వివరించారు. డీఆర్‌పీలు కే. శంకరయ్య, ఎస్. వేణుగోపాల్‌, పీఎం కేజీయా లతతోపాటు అంగన్వాడీ సూపర్‌వైజర్లు పార్వతి, జయలక్ష్మి శిక్షణా తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో పుల్లంపేట మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని శిక్షణ పొందుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.