Wednesday, 12 August 2026
  • Home  
  • తైక్వాండోలో ఎడిఫై విద్యార్థుల సత్తా * సౌత్‌జోన్-1 పోటీల్లో ఐదు పతకాలు * జాతీయ స్థాయికి ఇద్దరు క్రీడాకారుల అర్హత
- తిరుపతి

తైక్వాండోలో ఎడిఫై విద్యార్థుల సత్తా * సౌత్‌జోన్-1 పోటీల్లో ఐదు పతకాలు * జాతీయ స్థాయికి ఇద్దరు క్రీడాకారుల అర్హత

తిరుచానూరు ఆగస్టు 11 పున్నమి ప్రతినిధి సీబీఎస్‌ఈ సౌత్‌జోన్-1 తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో తిరుచానూరు ఎడిఫై స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని అరిజిన్ స్కూల్‌లో ఆగస్టు 4 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన 2026-27 సౌత్‌జోన్-1 తైక్వాండో పోటీల్లో ఎడిఫై స్కూల్ క్రీడాకారులు మొత్తం ఐదు పతకాలను సాధించారు. బాలుర విభాగంలో ఒక బంగారు, ఒక కాంస్య పతకం, బాలికల విభాగంలో ఒక వెండి, రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. మొత్తం ఒక బంగారు, ఒక వెండి, మూడు కాంస్య పతకాలతో పాఠశాలకు ఘనత తీసుకొచ్చారు. వీరిలో ఒక బాలుడు, ఒక బాలిక సీబీఎస్‌ఈ జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. జాతీయ స్థాయి పోటీలు హర్యానాలోని పానిపట్‌లో సెప్టెంబర్ 20 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్‌పర్సన్ పి.సులోచన, డైరెక్టర్ పి.ప్రణీత్, అకాడమిక్ డీన్ పి.జాహ్నవి, ప్రిన్సిపాల్ టి.దేవరాజులు, కోచ్ లవకుమార్‌తో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది విజేతలను అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

తిరుచానూరు ఆగస్టు 11 పున్నమి ప్రతినిధి

సీబీఎస్‌ఈ సౌత్‌జోన్-1 తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో తిరుచానూరు ఎడిఫై స్కూల్ విద్యార్థులు ప్రతిభ చాటారు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని అరిజిన్ స్కూల్‌లో ఆగస్టు 4 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన 2026-27 సౌత్‌జోన్-1 తైక్వాండో పోటీల్లో ఎడిఫై స్కూల్ క్రీడాకారులు మొత్తం ఐదు పతకాలను సాధించారు. బాలుర విభాగంలో ఒక బంగారు, ఒక కాంస్య పతకం, బాలికల విభాగంలో ఒక వెండి, రెండు కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. మొత్తం ఒక బంగారు, ఒక వెండి, మూడు కాంస్య పతకాలతో పాఠశాలకు ఘనత తీసుకొచ్చారు. వీరిలో ఒక బాలుడు, ఒక బాలిక సీబీఎస్‌ఈ జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించారు. జాతీయ స్థాయి పోటీలు హర్యానాలోని పానిపట్‌లో సెప్టెంబర్ 20 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్‌పర్సన్ పి.సులోచన, డైరెక్టర్ పి.ప్రణీత్, అకాడమిక్ డీన్ పి.జాహ్నవి, ప్రిన్సిపాల్ టి.దేవరాజులు, కోచ్ లవకుమార్‌తో పాటు ఉపాధ్యాయులు, సిబ్బంది విజేతలను అభినందించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.