Tuesday, 22 September 2026
  • Home  
  • అనపర్తి ఏరియా ఆసుపత్రిలో తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం
- తూర్పు గోదావరి

అనపర్తి ఏరియా ఆసుపత్రిలో తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

అనపర్తి, ఆగస్టు 11 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి ఏరియా ఆసుపత్రిలో 102 సర్వీసెస్‌లో భాగంగా తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్య సేవలను పరిశీలించి, పలువురు రోగులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగుపరిచి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో తొలిసారిగా తోకాడకు చెందిన ప్రసవించిన తల్లి, బిడ్డ ప్రయాణించారని, వారు ఆసుపత్రిలో అందిన వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధిపై హెచ్‌డీఎస్ కమిటీ నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. వంద పడకల ఆసుపత్రి భవనం సిద్ధంగా ఉందని, త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అదనంగా అవసరమైన రూ.15 కోట్ల నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సహకారంతో ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అనపర్తి, ఆగస్టు 11 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి ఏరియా ఆసుపత్రిలో 102 సర్వీసెస్‌లో భాగంగా తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్య సేవలను పరిశీలించి, పలువురు రోగులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆసుపత్రిలో వైద్య సేవలను మెరుగుపరిచి, రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో తొలిసారిగా తోకాడకు చెందిన ప్రసవించిన తల్లి, బిడ్డ ప్రయాణించారని, వారు ఆసుపత్రిలో అందిన వైద్య సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధిపై హెచ్‌డీఎస్ కమిటీ నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. వంద పడకల ఆసుపత్రి భవనం సిద్ధంగా ఉందని, త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. అదనంగా అవసరమైన రూ.15 కోట్ల నిధులను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సహకారంతో ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.