Monday, 10 August 2026
  • Home  
  • డాక్టర్ పెదపాటి విష్ణు జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం
- తూర్పు గోదావరి

డాక్టర్ పెదపాటి విష్ణు జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం

కేశవరం, ఆగస్టు 10 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): మండపేట మండలం కేశవరం గ్రామంలో ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి అధ్యక్షులు, గ్రామీణ వైద్యులు డాక్టర్ పెదపాటి విష్ణు జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సేవా రత్న అవార్డు గ్రహీత (పి.ఎస్.వి), ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి బిక్కవోలు శాఖ అధ్యక్షులు, పున్నమి తెలుగు దినపత్రిక ప్రతినిధి సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు, శ్రీమతి మణికుమారి హాజరై డాక్టర్ పెదపాటి విష్ణుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ విష్ణు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. శిబిరంలో విజయ్ ఆర్థోపెడిక్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ టి.వి. రామారెడ్డి, డాక్టర్ జి.వి. ధనుంజయ రెడ్డి, డాక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సుధా మల్లిడి, శారదా దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ కంటిపూడి తేజ, డాక్టర్ సంహిత్ వర్మ తదితరులు పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, షుగర్, రక్తవర్గ నిర్ధారణ, ఎముకలు–కీళ్లు, సాధారణ, స్త్రీల, గుండె, దంత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు, వైద్య సలహాలు అందించారు. శిబిరానికి హాజరై వైద్య సేవలు అందించిన వైద్యులు, వైద్య సిబ్బంది, గ్రామ పెద్దలు, సేవా సమితి సభ్యులు, సహకరించిన ప్రతి ఒక్కరినీ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు, శ్రీమతి మణికుమారి ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్వహించిన ఈ వైద్య శిబిరం విజయవంతం కావడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

కేశవరం, ఆగస్టు 10 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): మండపేట మండలం కేశవరం గ్రామంలో ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి అధ్యక్షులు, గ్రామీణ వైద్యులు డాక్టర్ పెదపాటి విష్ణు జన్మదినం సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సేవా రత్న అవార్డు గ్రహీత (పి.ఎస్.వి), ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ సేవా సమితి బిక్కవోలు శాఖ అధ్యక్షులు, పున్నమి తెలుగు దినపత్రిక ప్రతినిధి సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు, శ్రీమతి మణికుమారి హాజరై డాక్టర్ పెదపాటి విష్ణుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ విష్ణు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు.

శిబిరంలో విజయ్ ఆర్థోపెడిక్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ టి.వి. రామారెడ్డి, డాక్టర్ జి.వి. ధనుంజయ రెడ్డి, డాక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సుధా మల్లిడి, శారదా దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ కంటిపూడి తేజ, డాక్టర్ సంహిత్ వర్మ తదితరులు పాల్గొని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రక్తపోటు, షుగర్, రక్తవర్గ నిర్ధారణ, ఎముకలు–కీళ్లు, సాధారణ, స్త్రీల, గుండె, దంత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు, వైద్య సలహాలు అందించారు.

శిబిరానికి హాజరై వైద్య సేవలు అందించిన వైద్యులు, వైద్య సిబ్బంది, గ్రామ పెద్దలు, సేవా సమితి సభ్యులు, సహకరించిన ప్రతి ఒక్కరినీ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు, శ్రీమతి మణికుమారి ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిర్వహించిన ఈ వైద్య శిబిరం విజయవంతం కావడం పట్ల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.