(పున్నమి ప్రతినిధి )ఆగష్టు 09: మండలంలోని ములగపూడి బిసి బాలుర వసతిగృహం లో విద్యార్థులకు ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మేడిశెట్టి సూర్య కిరణ్ చేతుల మీదుగా చేతుల మీదుగా పీహెచ్సీ డాక్టర్స్ సౌందర్య డాక్టర్స్ సరోజ ఆధ్వర్యంలో దోమల తెరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో విద్యార్థులకు ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉండేందుకు ఈ దోమలు తెరలు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపడుతుందని సత్య ప్రభ రాజా అన్నారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు తమరాల సత్యనారాయణ ఇంటి వద్ద ఏర్పాటుచేసిన ఆత్మీయ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షురాలు గంటి మల్ల రాజలక్ష్మి, తుని జోన్ ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ కరణం సుబ్రహ్మణ్యం, సత్రం చైర్మన్ చంద్రమౌళి, బిజెపి మండల అధ్యక్షుడు లవుడు శ్రీను, మాజీ ఎంపీపీ ఈ భాస్కర బాబు, ఈగల సత్తిబాబు, జట్ల రాజా, పైల వేణుగోపాల్ జనసేన నాయకులు రౌతులపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ షేక్ సలీం, జయ గంట, కొరుప్రోలు నానాజీ, కొరుప్రోలు బాబ్జి, తోట దొరబాబు, శంఖవరం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు గాబు సుభాష్, ఉపాధ్యక్షులు తలపంటి బుజ్జి, కత్తిపూడి పిఎసిఎస్ డైరెక్టర్ శరణం జయబాబు, మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.


