పడమర పేట ఆగస్టు 8 పున్నమి ప్రతినిధి
అప్పలా యగుంటలోని తిరుమల తిరుపతి అనుబంధ ఆలయం ప్రసన్నవెంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం శ్రీవారితిరుచ్చివాహనసేవ,ఊంజల్ సేవ వైభవంగా నిర్వహించారు. ఉదయం వేకువ జామున సుప్రభాతసేవతో స్వామి వారిని మేల్కొలిపి నిత్య కైంకర్యాలు చేపట్టారు. సాయంత్రం ఉభయ నాంచారులతో ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని సర్వాభరణాలు, పూలమాలలతో ఊయలలో అలంకరించి వేదమంత్రాలు, భక్తుల గోవింద నామ స్మరణల నడుమ ఊంజల్ సేవ జరిపించారు. అనంతరం సర్వాలంకార భూషితుడైన పద్మావతీ ఆండాల్ సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ మాడ వీదుల్లో ఊరేగించారు. భక్తులు నారికేల, కర్పూర నీరాజనాలు సమర్పించి మొక్కులు తీర్చుకొన్నారు. అనంతరం ఆలయానికి చేరుకొన్న స్వామివారికి మంగళహారతులిచ్చారు. కార్యక్రమంలో అర్చకులు తిప్పయ్యచార్యులు, ఆలయ పర్యవేక్షకులు వేణుగోపాల్ పాల్గొన్నారు.


