పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ ఆగస్టు 7 చిట్టమూరు మండలం,
చిట్టమూరు మండలం కోగిలి గ్రామపంచాయతీ పరిధిలోని అంగనవాడి కేంద్రంలో ప్రపంచ తల్లిపాలు వార్షికోత్సవ పురస్కరించుకునే అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
తల్లిపాలే బిడ్డకు తొలి దివ్యచరిత్ర తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యానికి పునాది అని సిడిపిఓ ముని కుమారి పేర్కొన్నారు.
ఆమె ఆదేశాలు మేరకు సూపర్వైజర్ కవిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా సూపర్వైజర్ కవిత మాట్లాడుతూ, శిశువుకు జన్మించిన వెంటనే తల్లి పాలు ఇవ్వడం ద్వారా అవసరమైన పోషకాలు, రోగ నిరోధక శక్తి సమృద్ధిగా లభిస్తాయి అని తెలిపారు.
పుట్టినప్పటినుంచి తొలి ఆరు నెలల వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే అందించాలని, ఈ కాలంలో నీరు లేదా ఇతర ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదని వివరించారు.
తల్లిపాలు శిశువుకు జీర్ణక్రయను మెరుగుపరచడంతో పాటు విరోచనాలు, శ్వాస పోష ఇన్స్పెక్షన్లు వంటి అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయని తెలిపారు.
తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువుకు మాత్రమే కాకుండా తల్లికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని, తల్లి -బిడ్డ మధ్య ప్రేమ, అనుబంధం మరింత బలపడుతుందని,పేర్కొన్నారు
ప్రతి తల్లి తల్లిపాల ప్రాధాన్యాన్ని గుర్తించి శిశువుకు క్రమం తప్పకుండా పాలు ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు బాలామణి, పార్వతి,రాజమ్మ,సుశీలమ్మ,శేషమ్మ,అంకమ్మ, సరోజనమ్మ, ఆశ వర్కర్లు వీరనారాయణమ్మ, హైమావతి, ఏఎన్ఎం నర్సులు మస్తానమ్మ, గర్భిణీలు, బాలింతలు, మహిళలు పాల్గొని తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన పొందారు.
కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సిబ్బందిని అధికారులు అభినందించారు.
.


