ప్రకృతి, సేంద్రియ వ్యవసాయ విధానాలతోనే సుసంపన్నమైన రైతు భవిష్యత్ సాధ్యమవుతుందని శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన నాయకులు దండి నరేంద్ర పేర్కొన్నారు. శ్రీకాళహస్తి మండలం ముచ్చివోలు గ్రామంలో ప్రకృతి వ్యవసాయంపై నిర్వహించిన సమగ్ర అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎల్‌నినో ప్రభావం, పంటల ఎంపికపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు పీఎమ్‌డీఎస్ పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే పామ్ ఆయిల్ సాగుపై సబ్సిడీలు, 20 రకాల విత్తనాలతో కూడిన మల్టీ సీడ్ బ్యాగ్స్ ప్రయోజనాలు, విత్తన బంతుల (సీడ్ బాల్స్) తయారీ విధానాన్ని రైతులకు ప్రత్యక్షంగా ప్రదర్శించారు. పొలాలను సందర్శించి ఆకుమచ్చ వైరస్ నివారణకు నీమాస్త్రం వాడకంపై ఉద్యానవన శాఖ అధికారులు, నిపుణులు రైతులకు విలువైన సూచనలు చేశారు. సేంద్రియ విధానాల ద్వారా నేలను, పర్యావరణాన్ని కాపాడుకోవడమే తమ లక్ష్యమని తెలిపిన నరేంద్ర.. త్వరలోనే పరిసర గ్రామాల్లో భారీ అవగాహన సదస్సులు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖ అధికారులు, ప్రకృతి వ్యవసాయ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయంతోనే రైతు సురక్షిత భవిష్యత్-జనసేన నాయకులు దండి నరేంద్ర