జోగులాంబ గద్వాల జిల్లా దారూర్ మండల పరిధిలోని పెద్ద చింతరేవుల గ్రామం నందు 18వ శతాబ్దంలో వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో ఉడిపి మరియు పాలిమారు పీఠాధిపతులు1008 శ్రీ విద్యా దేశ తీర్థ శ్రీపాదుల వారు,1008 విద్యా రాజేశ్వర తీర్థ శ్రీపాదుల వారు నేటి నుండి 56 రోజులపాటు 48వ చాతుర్మాస్య ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఆద్య చక్రవర్తి కేశవాచార్యులు తెలిపారు. ఉడిపి నుండి విచ్చేసిన పీఠాధిపతులకు పూర్ణకుంభం మేళతాళాలతో అర్చకులు భక్తులు ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద చింతరేవుల ఆధ్యాత్మిక శోభతో వేళ్లి విరిసింది. ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 7 గంటల వరకు మరియు 10:30 నుండి 12 గంటల వరకు భక్తులకు విశేష ప్రవచనాలు పీఠాధిపతులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పీఠాధిపతులను దర్శించుకున్న ప్రతి భక్తునికి అల్పాహారము భోజనవసతి పెద్ద చింతరేవుల అన్నం ప్రసాద కమిటీ వారిచే కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆద్య వామనాచారి,ఆద్య కిష్టాచారి, ఆద్య మద్వాచారి, వివిధ ప్రాంతాలనుండి వచ్చిన భక్తులు మహిళలు పాల్గొన్నారు.
Uploaded Video:


