ఈ సందర్భంగా ICDS సూపర్వైజర్ కె. రాధ మాట్లాడుతూ, తల్లిపాలు పుట్టిన బిడ్డకు సహజసిద్ధమైన సంపూర్ణ ఆహారమని, వాటిలో రోగనిరోధక శక్తిని పెంచే ప్రోటీన్లు అధికంగా ఉంటాయని తెలిపారు. పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు, రోగనిరోధక శక్తి, జ్ఞాపకశక్తి, శారీరక–మానసిక ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
అలాగే గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.*
*ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు పి. విజయలక్ష్మి, బి. రజిత, ఎం. సరోజన, ఆయాలు ఏ. నీలమ్మ, ఆర్. కట్టమ్మ, ఎం. శారద, ఆశా కార్యకర్తలు షామీన్, ఎం. లత, డి. రాజమణి, గర్భిణీలు, బాలింతలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు.*



