తిరుపతి ఆగస్టు 06 (పున్నమి ప్రతినిధి)
తిరుపతి పోలీసులు అంతర్రాష్ట్ర గజదొంగ రాజబాబును అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ.14.87 లక్షల విలువైన 64 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.5 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వ్యసనాలకు బానిసైన నిందితుడు రైళ్లలో సంచరిస్తూ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై రాష్ట్రవ్యాప్తంగా 80కు పైగా కేసులు నమోదవగా, 15 కేసుల్లో శిక్ష కూడా అనుభవించినట్లు అదనపు ఎస్పీ శ్రీనివాసులు వెల్లడించారు.


