Wednesday, 5 August 2026
  • Home  
  • భద్రాచలంలో నూతన వంతెన పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల
- భద్రాద్రి కొత్తగూడెం

భద్రాచలంలో నూతన వంతెన పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల

భద్రాచలం రూరల్, ఆగస్టు 5: భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న నూతన వంతెన పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులను నిర్వహిస్తున్న ఇంజినీర్లతో మాట్లాడిన మంత్రి, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకుని నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. సారపాక మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ కన్నెదారి రమేష్, సర్పంచ్ గుగులోత్ కిషోర్ శిష్టారం నాయక్ పూలబొకే అందజేసి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, “భద్రాచలం అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. నూతన వంతెన నిర్మాణం పూర్తయితే ప్రజల రాకపోకలు మరింత సులభతరం అవుతాయి” అని పేర్కొన్నారు.

భద్రాచలం రూరల్, ఆగస్టు 5: భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న నూతన వంతెన పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం పరిశీలించారు. వంతెన నిర్మాణ పనులను నిర్వహిస్తున్న ఇంజినీర్లతో మాట్లాడిన మంత్రి, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకుని నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. సారపాక మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ కన్నెదారి రమేష్, సర్పంచ్ గుగులోత్ కిషోర్ శిష్టారం నాయక్ పూలబొకే అందజేసి, శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, “భద్రాచలం అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. నూతన వంతెన నిర్మాణం పూర్తయితే ప్రజల రాకపోకలు మరింత సులభతరం అవుతాయి” అని పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.