బద్వేల్ నియోజకవర్గం అట్లూరు మండలం లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థినులకు బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మంచూరు సూర్యనారాయణ రెడ్డి తన స్వంత నిధులతో క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థినులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరుస్తుండడం అభినందనీయమన్నారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఇరవై మూడు రకాల క్రీడల్లో విద్యాలయ విద్యార్థినులు రాణించడం పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయుల కృషికి నిదర్శనమని కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. “షైన్ స్టార్ అవార్డులు”, “తల్లికి వందనం” వంటి పథకాల ద్వారా విద్యార్థినులకు మంచి ప్రోత్సాహం లభిస్తోందని పేర్కొన్నారు. కేజీబీవీ అట్లూరులో ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థినులకు పదివేల రూపాయల ప్రత్యేక ప్రోత్సాహకం అందజేశారు. కార్యక్రమం అనంతరం సూర్యనారాయణ రెడ్డి విద్యార్థినులతో కలిసి సాఫ్ట్బాల్ ఆటలో పాల్గొని వారిని ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో సర్వశిక్షా అభియాన్ జిల్లా అధికారి, ఎంపీడీవో, ఎంఈఓలు, బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కేజీబీవీ అట్లూరు విద్యార్థినులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన మంచూరు