నెల్లూరు ఆగస్టు 4 ( పున్నమి, కో ఆర్డినేటర్ విజయ్ )
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 54 మంది బాధితులకు రూ.47 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 54 మంది బాధితులకు, 47 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ….
కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో 697 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.6 కోట్లు రూపాయల సాయం అందించడం సంతోషంగా ఉందన్నారు.
ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా పేదల దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ.. ఆర్థికసాయం మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి .


