ప్రతి ఇంటి నుంచి అంబలి సమర్పించిన మహిళలు
రామచంద్రాపురం ఆగస్టు 04( పున్నమి ప్రతినిధి)
గ్రామాన్ని, గ్రామ ప్రజలను చల్లగా చూడాలని రామచంద్రపురం మండలం సికేపల్లి పంచాయతీ చిట్టత్తూరు గ్రామంలో గ్రామ మహిళలు మంగళవారం నడి వీధి గంగమ్మకు చల్ల పోసి ప్రత్యేక పూజలు చేశారు.సకాలంలో వర్షాలు పడాలని, పైరుపచ్చలు బాగా పండాలని, గ్రామంలో దుష్టశక్తుల ప్రభావం నివారించాలని, గ్రామంలోని ప్రజలందరినీ సుఖశాంతుల కలగాలని స్త్రీ శక్తికి ఐక్యమత్యంగా గ్రామంలోని మహిళలందరూ కలిసి గ్రామ దేవత నడివీధి గంగమ్మకు చల్ల పోసి, అంబలి సమర్పించి పూజలు చేశారు. మంగళవారం గ్రామ వీధులలో వరి గడ్డితో తాళ్లు పేడి వేప మండల చెక్కి కట్టారు.ప్రతి ఇంటి నుంచి మహిళలు అంబలి కలిపి వూరేగింపుగా గంగమ్మ వద్దకు తీసుకుని వచ్చి సమర్పించారు.అందరు తెచ్చిన అంబలిని కలబోసి,అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టారు.







