Monday, 3 August 2026
  • Home  
  • మహోపాధ్యాయుడు కె.వి. కోటిలింగం మాస్టారు అస్తమయం
- ఆంధ్రప్రదేశ్

మహోపాధ్యాయుడు కె.వి. కోటిలింగం మాస్టారు అస్తమయం

( జయప్రతాప్ రెడ్డి) కొంపల్లి వెంకట కోటిలింగం ఈరోజు 03-08-2026 ఉదయం 10 గంటలకు కావలి లోని రాజా వీధిలో తమ నివాసంలో పరమపదించారు. వీరు 90 సంవత్సరాలు జీవించారు. వీరు జవహర్ భారతి కళాశాలలో చదువుకొని, అక్కడే రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా, శాఖా ధిపతిగా, వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేసి అక్టోబర్ 31, 1994వ సంవత్సరంలో ఉద్యోగ విరమణ గావించారు. ఆ తరువాత 1996 నుంచి 2007 దాకా సుమారు 11 సంవత్సరాల పాటు జవహర్ భారతి జూనియర్ కళాశాలకు కరస్పాండెంట్ గా విశిష్ట సేవలు అందించి, ఇతోధికంగా కళాశాల అభివృద్ధికి దోహదపడ్డారు. విశ్వోదయ వైస్ ప్రెసిడెంట్ గా, విశ్వోదయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా, విశ్వోదయ జనరల్ కౌన్సిల్ శాశ్వత సభ్యునిగా సేవలందించారు. వారు విశ్వోదయ, జవహర్ భారతి తో 70 సంవత్సరాల అనుబంధాన్ని కలిగి ఉన్నారు. వారి జీవిత కాలపు కృషికి గుర్తుగా 2010లో విశ్వోదయ గౌరవ జీవిత సభ్యత్వాన్ని ప్రదానం చేశారు. వీరు తెలుగు అకాడమీకి ఇంటర్మీడియట్ స్థాయిలో పౌరశాస్త్రం పాఠ్యపుస్తకాన్ని, బి.ఏ. స్థాయిలో రాజకీయ భావనలు-సంస్థలు పాఠ్య పుస్తకాన్ని, ఎం.ఏ. స్థాయిలో స్వాతంత్రోద్యమం- రాజ్యాంగ వికాసం పాఠ్యపుస్తకాన్ని రచించారు. ఇవి కాక ఇహం పరం శతకం, వ్యక్తిత్వ వికాస శతకం పుస్తకాలని రాశారు. వీరు జ్ఞాపకశక్తి కన్నా ఆలోచన శక్తిని పెంపొందించే విధంగా బోధించేవారు. వారు జీవించిన చివరి నిమిషం వరకు కొత్త విషయాలను నేర్వాలనే. తృష్ణతోనే కాలం గడిపారు. 90 సంవత్సరాలు జీవించిన ఈ మహోపాధ్యాయుడు తనను నిత్య విద్యార్థిగా సగర్వంగా చెప్పుకుంటారు. వారి మరణం విశ్వోదయ కుటుంబానికి, విద్యార్థి లోకానికి తీరని లోటు అని విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి, విశ్రాంత అధ్యాపకులు వి.చెంచయ్య, విశ్వోదయ పాలకమండలి సభ్యులు కె. తాతిరెడ్డి జవహర్ భారతి అధ్యాపక సంఘం తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

( జయప్రతాప్ రెడ్డి)
కొంపల్లి వెంకట కోటిలింగం ఈరోజు 03-08-2026 ఉదయం 10 గంటలకు కావలి లోని రాజా వీధిలో తమ నివాసంలో పరమపదించారు. వీరు 90 సంవత్సరాలు జీవించారు. వీరు జవహర్ భారతి కళాశాలలో చదువుకొని, అక్కడే రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా, శాఖా ధిపతిగా, వైస్ ప్రిన్సిపాల్ గా పనిచేసి అక్టోబర్ 31, 1994వ సంవత్సరంలో ఉద్యోగ విరమణ గావించారు. ఆ తరువాత 1996 నుంచి 2007 దాకా సుమారు 11 సంవత్సరాల పాటు జవహర్ భారతి జూనియర్ కళాశాలకు కరస్పాండెంట్ గా విశిష్ట సేవలు అందించి, ఇతోధికంగా కళాశాల అభివృద్ధికి దోహదపడ్డారు. విశ్వోదయ వైస్ ప్రెసిడెంట్ గా, విశ్వోదయ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా, విశ్వోదయ జనరల్ కౌన్సిల్ శాశ్వత సభ్యునిగా సేవలందించారు. వారు విశ్వోదయ, జవహర్ భారతి తో 70 సంవత్సరాల అనుబంధాన్ని కలిగి ఉన్నారు. వారి జీవిత కాలపు కృషికి గుర్తుగా 2010లో విశ్వోదయ గౌరవ జీవిత సభ్యత్వాన్ని ప్రదానం చేశారు. వీరు తెలుగు అకాడమీకి ఇంటర్మీడియట్ స్థాయిలో పౌరశాస్త్రం పాఠ్యపుస్తకాన్ని, బి.ఏ. స్థాయిలో రాజకీయ భావనలు-సంస్థలు పాఠ్య పుస్తకాన్ని, ఎం.ఏ. స్థాయిలో స్వాతంత్రోద్యమం- రాజ్యాంగ వికాసం పాఠ్యపుస్తకాన్ని రచించారు. ఇవి కాక ఇహం పరం శతకం, వ్యక్తిత్వ వికాస శతకం పుస్తకాలని రాశారు. వీరు జ్ఞాపకశక్తి కన్నా ఆలోచన శక్తిని పెంపొందించే విధంగా బోధించేవారు. వారు జీవించిన చివరి నిమిషం వరకు కొత్త విషయాలను నేర్వాలనే. తృష్ణతోనే కాలం గడిపారు. 90 సంవత్సరాలు జీవించిన ఈ మహోపాధ్యాయుడు తనను నిత్య విద్యార్థిగా సగర్వంగా చెప్పుకుంటారు. వారి మరణం విశ్వోదయ కుటుంబానికి, విద్యార్థి లోకానికి తీరని లోటు అని విశ్వోదయ రెక్టార్ దొడ్ల వినయ్ కుమార్ రెడ్డి, విశ్రాంత అధ్యాపకులు వి.చెంచయ్య, విశ్వోదయ పాలకమండలి సభ్యులు కె. తాతిరెడ్డి జవహర్ భారతి అధ్యాపక సంఘం తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.