తిరుపతి ఆగస్టు 03 (పున్నమి ప్రతినిధి)
*తెలుగుదేశం పార్టీ నాయకులు, సాయి నగర్ జస్వంత్ రాయల్ (సన్నీ) ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడటం జరిగింది. విషయం తెలుసుకున్న తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా డాక్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఈరోజు వారి నివాసానికి వెళ్ళి పరామర్శించారు సాయి నగర్ లోని జస్వంత్ రాయల్ (సన్నీ) గృహానికి చేరుకున్న తుడా ఛైర్మన్ వారి క్షేమ సమాచారాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అవిలాల, ఉమ్మడి సాయి నగర్ పంచాయతి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.




