ప్రపంచ స్నేహితుల దినోత్సవం రోజున ఆపదలో ఉన్న తోటి స్నేహితుడికి అండగా నిలిచి ఔన్నత్యాన్ని చాటుకున్నారు బెల్లంపల్లి జెడ్పీహెచ్ఎస్ బజార్ ఏరియా పాఠశాల పూర్వ విద్యార్థులు. వివరాల్లోకి వెళితే తమతోపాటు పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న స్నేహితుడు అనారోగ్యంతో బాధపడుతుంటే సాటి మిత్రులు తోడుగా నిలిచారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బజార్ ఏరియా పాఠశాల 2001-02 పదవ తరగతి పూర్వ విద్యార్థుల్లో ఒకరైన కళాధర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి అనారోగ్యానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న తోటి పూర్వ విద్యార్థులు నగదు జమ చేసి వారి కుటుంబ సభ్యులకు నెలకు సరిపడా నిత్యవసర సరుకులు అందజేశారు. అనంతరం మిత్రుడి తల్లిని కలిసి వారి యోగాక్షేమలు అడిగి తెలుసుకున్నారు. ఏ ఆపదలో అయిన అండగా ఉంటామని వారికి భరోసా కల్పించారు.

ఆపదలో తోడుగా నిలిచిన స్నేహితులు