ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్)
మధిర / ఖమ్మం
మధిర: స్టేషన్ తనిఖీ నిమిత్తం మధిరకు విచ్చేసిన దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్‌ను బీజేపీ మధిర టౌన్, రూరల్ నాయకులు కలిసి పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. మధిర రైల్వే స్టేషన్లో మరిన్ని రైళ్లకు నిలుపుదల కల్పించడంతో పాటు కొత్త రైళ్లకు స్టాపేజీ ఇవ్వాలని కోరారు. అలాగే కోచ్ ఇండికేటర్ డిస్ప్లే బోర్డులు, తాగునీటి సౌకర్యం, శౌచాలయాల ఏర్పాటు, రెండో ప్లాట్‌ఫారంపై షెడ్ల నిర్మాణం వంటి సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు వారధిగా, వందల గ్రామాలకు కేంద్రంగా ఉన్న మధిర రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ టౌన్ అధ్యక్షుడు శివరాజు సుమంత్, రూరల్ అధ్యక్షుడు గడ్డం శ్రీహరి చౌదరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏలూరి నాగేశ్వరరావు, చిలువేరు సాంబశివరావు, గుండా చంద్రశేఖర్ రెడ్డి, పాపట్ల రమేష్, చక్రవర్తుల వరదరాజన్, దుగ్గిదేవర మణికంఠ తదితరులు పాల్గొన్నారు.



