అనకాపల్లి జిల్లా, జూలై 31 (పున్నమి ప్రతినిధి)
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా శుక్రవారం ప్రాథమిక ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ప్రతి ఓటరు తమ పేరు, ఫోటో, పుట్టిన తేదీ, చిరునామా తదితర వివరాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. జాబితాలో ఏవైనా తప్పులు ఉంటే సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) ద్వారా సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కొత్త ఓటర్ల నమోదు, అనర్హులైన లేదా మరణించిన వారి పేర్ల తొలగింపు, ఇతర అభ్యంతరాలు, మార్పులు, సవరణలకు అవకాశం కల్పించారు. జూలై 31 నుంచి ఆగస్టు 30, 2026 వరకు BLO ద్వారా లేదా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. సవరణ ప్రక్రియ అనంతరం అక్టోబర్ 3, 2026న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఓటరు తమ వివరాలను తప్పనిసరిగా పరిశీలించి, ఏమైనా లోపాలు ఉంటే నిర్ణీత గడువులోగా సరిచేసుకోవాలని సూచించారు.

ఓటర్ల జాబితా విడుదల.. ఆగస్టు 30లోగా అభ్యంతరాలు తెలపండి
అనకాపల్లి జిల్లా, జూలై 31 (పున్నమి ప్రతినిధి) ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా శుక్రవారం ప్రాథమిక ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ప్రతి ఓటరు తమ పేరు, ఫోటో, పుట్టిన తేదీ, చిరునామా తదితర వివరాలను పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. జాబితాలో ఏవైనా తప్పులు ఉంటే సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ (BLO) ద్వారా సవరణకు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే కొత్త ఓటర్ల నమోదు, అనర్హులైన లేదా మరణించిన వారి పేర్ల తొలగింపు, ఇతర అభ్యంతరాలు, మార్పులు, సవరణలకు అవకాశం కల్పించారు. జూలై 31 నుంచి ఆగస్టు 30, 2026 వరకు BLO ద్వారా లేదా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. సవరణ ప్రక్రియ అనంతరం అక్టోబర్ 3, 2026న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఓటరు తమ వివరాలను తప్పనిసరిగా పరిశీలించి, ఏమైనా లోపాలు ఉంటే నిర్ణీత గడువులోగా సరిచేసుకోవాలని సూచించారు.

