రాజన్న సిరిసిల్ల జూలై 30(పున్నమి ప్రతినిధి)
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో రూ.322.50 లక్షలతో రగుడు జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ, బస్ షెల్టర్ల నిర్మాణ పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ పనులతో పట్టణ సౌందర్యం మెరుగుపడటంతో పాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని నాయకులు తెలిపారు.



