ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్ )
ఖమ్మం నగర 8వ డివిజన్లో బీఆర్ఎస్ కార్యకర్తలు నూతనంగా నిర్మించిన గులాబీ గద్దెను రాత్రికి రాత్రే ధ్వంసం చేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్ నాయకులు పార్టీ గుర్తులు, నిర్మాణాలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. గులాబీ జెండాను కూల్చే శక్తి ఎవరికీ లేదని, ప్రజల గుండెల్లో ఉన్న బీఆర్ఎస్ను చెరిపేయడం సాధ్యం కాదన్నారు. ఇలాంటి బెదిరింపులకు పార్టీ శ్రేణులు భయపడవని, ప్రజల పక్షాన తమ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మాజీ డిప్యుటీ మేయర్ బత్తుల మురళి, నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, బచ్చు విజయ్ కుమార్ లు పాల్గొన్నారు



