తాడేపల్లి, జూలై 29 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్గా తనను నియమించిన సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును అనపర్తి నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయం, నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలపై చర్చించారు. నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మనోజ్ రెడ్డి తెలిపారు.



