ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్ )
నిరుద్యోగ యువత కి ఉపాధి కల్పించే ఉద్దేశంతో అమలు చేస్తున్న ప్రధాని ఉపాధి కల్పన కార్యక్రమం (PMEGP)లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వెలువడ్డాయి. వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయకుండానే బినామీ పేర్లతో సుమారు రూ.10 కోట్ల సబ్సిడీ రుణాలు పొందినట్లు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా రుణాలు మంజూరు చేశారనే ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఈ వ్యవహారంపై బ్యాంకు సిబ్బంది పాత్రను కూడా పరిశీలిస్తున్నామని డీసీసీబీ సీఈఓ వెంకట్ ఆదిత్య పున్నమి న్యూస్‌కు వెల్లడించారు.



