Wednesday, 29 July 2026
  • Home  
  • సీఎం చంద్రబాబుతో అనపర్తి అభివృద్ధిపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చర్చ
- తూర్పు గోదావరి

సీఎం చంద్రబాబుతో అనపర్తి అభివృద్ధిపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చర్చ

వెలగపూడి, జూలై 28 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అనపర్తి నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి, కొనసాగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే కోరినట్లు తెలిపారు. అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

వెలగపూడి, జూలై 28 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి):
వెలగపూడి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడిని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చర్చించారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

అనపర్తి నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి, కొనసాగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎమ్మెల్యే కోరినట్లు తెలిపారు. అనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్లు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.