ఖమ్మం, జూలై
:
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు నరపరాజు రామచందర్ రావు ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లాలో ప్రవాసి యోజన కార్యక్రమం కొనసాగుతోంది. జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు సూచనల మేరకు ఖమ్మం 2వ పట్టణానికి ప్రవాసి ప్రభారిగా విచ్చేసిన మాజీ జిల్లా అధ్యక్షులు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణ, రాష్ట్ర సీనియర్ నాయకులు జెంటెల విద్యాసాగర్, మాజీ జిల్లా ఉపాధ్యక్షులు వెల్పుల సుధాకర్ ఖమ్మం 2వ పట్టణ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ యాదవ్‌తో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా SIR కార్యక్రమం విజయవంతం చేయడం, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో సమన్వయం, ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి అంశాలపై నాయకులు చర్చించారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం 2వ పట్టణ ప్రధాన కార్యదర్శి రుద్రగాని మాధవ్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యాలయ ఇన్చార్జి నక్క రవిగౌడ్, జిల్లా ఐటీ ఇన్చార్జి బోయినపల్లి సురేష్‌తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

