తొట్టంబేడు, జూన్ 06, (పున్నమి న్యూస్) : తొట్టంబేడు మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో శుక్రవారం చెత్త సేకరణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ ఆటోలను ఘనంగా ప్రారంభించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తల్లి బొజ్జల బృందమ్మ, మండల అధ్యక్షుడు రావెళ్ల మునిరాజు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరై, కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా ఇంటింటి నుంచి చెత్తను సమర్థవంతంగా సేకరించవచ్చని తెలిపారు. స్వచ్ఛ భారత్ లక్ష్య సాధనలో భాగంగా మండలాన్ని సంపూర్ణ పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ ఆటోలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. డీజిల్ వాహనాలతో పోలిస్తే ఇవి కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, నిర్వహణ ఖర్చులను కూడా భారీగా ఆదా చేస్తాయని వివరించారు. మండల ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకుని గ్రామాలను స్వచ్ఛంగా ఉంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి.సురేంద్రనాథ్, డిప్యూటీ ఎంపీడీవో భార్గవ్, గుడిమల్లం ఆలయ చైర్మన్ గిరి నాయుడు, మాజీ మండల అధ్యక్షుడు గాలి మురళి నాయుడు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ధనంజయ నాయుడు, సింగిల్ విండో చైర్మన్ భీమల భాస్కర్ ముదిరాజ్ పాల్గొన్నారు. అలాగే 9వ బూత్ యూనిట్ ఇంచార్జ్ లెక్కల మురళి నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి (సుబ్రహ్మణ్యం), సుధాకర్ యాదవ్, ఏజీపీ కమలాకర్, చేమూరు టీడీపీ బూత్ కన్వీనర్ ముని, రాఘవరెడ్డి, తెలుగు యువత అధ్యక్షుడు పవన్ నాయుడు, మళ్లీ గుంట ఎస్సీ బూత్ ఇంచార్జ్ కే శంకర్, పలువురు మండల అధికారులు, సిబ్బంది, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

చెత్త సేకరణకు ఎలక్ట్రిక్ ఆటోలు ప్రారంభించిన బొజ్జల బృందమ్మ