పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ జులై 28 కోట మండలం,
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ప్రధాన సమస్యగా దృష్టిలోపాన్ని చెబుతున్నారని ఆ క్రమంలో తమ ఫౌండేషన్ దృష్టిలోపాన్ని పూర్తిగా అరికట్టేందుకు నేత్ర శిబిరాలు నిర్వహించి తద్వారా అందత్వ నివారణకు కృషి చేస్తుందని ఎంవి రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ అన్నారు.
మంగళవారం కోట మండల పరిధిలోని టవర్ సెంటర్లో గిరిజనులకు నేత్ర వైద్య శిబిరం నిర్వహించి తద్వారా దృష్టిలోపం ఉన్నవారిని గుర్తించారు.
రమేష్ ఐ కేర్ వైద్య నిపుణులు రమేష్ ఆధ్వర్యంలో ఆ ప్రాంత వాసులకు కంటి పరీక్షలు నిర్వహించి కంటే అద్దాల అవసరమైన వారికి అతి తక్కువ ధరకు కంటి అద్దాలు ఇవ్వనున్నట్లు దృష్టిలోపం తో బాధపడే వారికి కంటి శుక్లాల ఆపరేషన్ ఉచితంగా చేయనున్నట్లు లీలా మోహన్ కృష్ణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ నిర్వాహకులు లీలా మోహన్ కృష్ణ. విజయలక్ష్మి డాక్టర్ రమేష్ వైద్య సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.



