Tuesday, 28 July 2026
  • Home  
  • కృష్ణాపురంలో “రెండేళ్ళ నమ్మకం అభివృద్ధి, సంక్షేమం” ఇంటింటి ప్రచారం విజయవంతం*
- తిరుపతి

కృష్ణాపురంలో “రెండేళ్ళ నమ్మకం అభివృద్ధి, సంక్షేమం” ఇంటింటి ప్రచారం విజయవంతం*

-ముఖ్య అతిథులుగా పనబాక లక్ష్మి,కూరపాటి శంకర్ రెడ్డి హాజరు* రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” ఇంటింటి ప్రచార కార్యక్రమం మంగళవారం నాగలాపురం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి పనబాక లక్ష్మి గ, సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించి, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే స్థానిక ప్రజల అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని పార్టీ నాయకులకు తగిన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్, కో-క్లస్టర్, బూత్, కో-బూత్ ఇన్‌చార్జీలు, ఐటీడీపీ, తెలుగు యువత, అనుబంధ విభాగాల నాయకులు, రాష్ట్ర డైరెక్టర్లు, ఏఎంసీ, పీఏసీ ఛైర్మన్లు, డైరెక్టర్లు, యూనిట్ అధ్యక్షులు, కో-యూనిట్ ఇన్‌చార్జీలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేర్చడమే ఈ కార్యక్రమం లక్ష్యమని, పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పాల్గొని విజయవంతం చేయాలని నాగలాపురం మండల తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ అధ్యక్షులు నరేంద్ర రెడ్డి పిలుపునిచ్చారు. “ప్రతి ఇంటికి తెలుగుదేశం -ప్రతి కుటుంబానికి అభివృద్ధి సందేశం”, “ప్రతి కార్యకర్త ఒక సైనికుడు – ప్రతి బూత్‌లో విజయమే లక్ష్యం” అనే నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

-ముఖ్య అతిథులుగా పనబాక లక్ష్మి,కూరపాటి శంకర్ రెడ్డి హాజరు*

రాష్ట్ర ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” ఇంటింటి ప్రచార కార్యక్రమం మంగళవారం నాగలాపురం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి పనబాక లక్ష్మి గ, సత్యవేడు నియోజకవర్గ ప్రోగ్రాం కోఆర్డినేటర్ శ్రీ కూరపాటి శంకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఉదయం 9 గంటలకు గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించి, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. అలాగే స్థానిక ప్రజల అభిప్రాయాలు, సమస్యలను తెలుసుకుని పార్టీ నాయకులకు తగిన సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో క్లస్టర్, కో-క్లస్టర్, బూత్, కో-బూత్ ఇన్‌చార్జీలు, ఐటీడీపీ, తెలుగు యువత, అనుబంధ విభాగాల నాయకులు, రాష్ట్ర డైరెక్టర్లు, ఏఎంసీ, పీఏసీ ఛైర్మన్లు, డైరెక్టర్లు, యూనిట్ అధ్యక్షులు, కో-యూనిట్ ఇన్‌చార్జీలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేర్చడమే ఈ కార్యక్రమం లక్ష్యమని, పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పాల్గొని విజయవంతం చేయాలని నాగలాపురం మండల తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ అధ్యక్షులు నరేంద్ర రెడ్డి పిలుపునిచ్చారు.

“ప్రతి ఇంటికి తెలుగుదేశం -ప్రతి కుటుంబానికి అభివృద్ధి సందేశం”, “ప్రతి కార్యకర్త ఒక సైనికుడు – ప్రతి బూత్‌లో విజయమే లక్ష్యం” అనే నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.