శ్రీ కాళహస్తి, జులై 27, (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అభివృద్ధి-సంక్షేమాలను సమతుల్యం చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం సఫలీకృతమైందని టీడీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం. ఉమేష్ రావు కొనియాడారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయవంతమైన సుపరిపాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా, సోమవారం శ్రీకాళహస్తి పట్టణంలోని 18వ వార్డు, 52వ బూత్ పరిధిలో బూత్ కన్వీనర్ గాజుల భగత్ ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరిస్తూ ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డా. ఉమేష్ రావు మాట్లాడుతూ…. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని రెండేళ్లలోనే అమలు చేసి ప్రభుత్వం నమ్మకాన్ని నిలబెట్టుకుందన్నారు. ‘దీపం-2’ ద్వారా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తూ పేద కుటుంబాలకు అండగా నిలిచారని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రూ.66 వేల కోట్లకు పైగా వెచ్చించి కొండంత ఆసరా ఇచ్చారని తెలిపారు. ఈ పథకం కింద 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ, కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా రూ.10,120.78 కోట్లు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశారని వివరించారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టి, యువత ఉపాధి కలలను సాకారం చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, పట్టణ ప్రధాన కార్యదర్శి కాసరం రమేష్, లక్కమనేని మధుబాబు, వజ్రం కిషోర్, ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు గాదిపాకుల గోపీనాథ్, మాజీ కౌన్సిలర్ షేక్ మహబూబ్ బాషా, కోట చంద్రశేఖర్, సయ్యద్ చాంద్ బాషా, పూల శేఖర్, నూర్ మొహమ్మద్, గగన్ యాదవ్, ఐటీడీపీ నాయకుడు ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్డీయే రెండేళ్ల పాలన అభివృద్ధి – సంక్షేమానికి స్వర్ణయుగం-డా. ఉమేష్ రావు