ఖమ్మం /నేలకొండపల్లి, జూలై
(పున్నమి న్యూస్ )
భారతరత్న, మాజీ రాష్ట్రపతి, భారతదేశపు “మిస్సైల్ మ్యాన్” డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేలకొండపల్లి మైనారిటీ మోర్చా మండల అధ్యక్షులు సయ్యద్ మోహినుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO), భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)లో ఏరోస్పేస్ ఇంజనీర్‌గా విశేష సేవలందించిన కలాం, భారత క్షిపణి సాంకేతిక అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. పోఖ్రాన్-2 అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించిన ఆయన, యువతకు స్ఫూర్తిదాయక నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి ఆయన చూపిన దార్శనికత చిరస్మరణీయమని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర నాయకులు షేక్ షర్ఫుద్దీన్, సూరెపల్లి జ్ఞానరత్నం, పిట్టల సూరిబాబు, జెల్లా సురేష్, ఏపూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



