ఖమ్మం, జూలై
(పున్నమి న్యూస్):
ఖమ్మం నగరంలోని వి.డి.ఓ కాలనీలో బుధవారం నాడు గురు పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ బాధ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వేకువజాము నుంచే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గురుపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
మధ్యాహ్నం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గురు పౌర్ణమి మహోత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గురువుల ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.



