Press Note :-
*నందలూరు మండల గ్రామ ప్రజలకు, నాయకులకు మరియు మీడియా మిత్రులకు పోలీసు వారి విజ్ఞప్తి*
28.07.2026 వ తేదీన శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణోత్సవ సందర్భంగా నందలూరు టౌన్ లో ట్రాఫిక్ డైవర్షన్ చేయడమైనది. పొత్తపి,చెన్నయ్యగారి పల్లి, లేబాక, ఆడపూరు గ్రామాల వైపు నుండి నందలూరు టౌన్ కు వచ్చే ప్రజలు నందలూరు గుడి వైపు దారిలో రాకుండా ఈదరపల్లి,దుర్గాపురం మీదుగా నందలూరు టౌన్ లోకి వెళ్ళవలెను, శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణానికి మరియు దర్శనానికి వచ్చే భక్తులు మాత్రం నందలూరు హరిజనవాడ దగ్గర ఉన్న పార్కింగ్ ప్రదేశంలో వాహనాలు నిలిపి గుడి వద్దకు కాలినడకన వెళ్ళవలెను, అదేవిధంగా నందలూరు వైపు నుండి సౌమ్యనాథ స్వామి దర్శనానికి మరియు కళ్యాణానికి వచ్చు భక్తులు నందలూరు షాది ఖానా వద్ద ఉన్న పార్కింగ్ ప్రదేశం లో వాహనాలు నిలుపుకొని సౌమ్యనాథ స్వామి గుడి వద్దకు కాలినడకన రావలసిందిగా పోలీసు వారి విజ్ఞప్తి. శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణం దృష్టిలో ఉంచుకొని పై విధంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయడమైనది, కావున నందలూరు మండల ప్రజలు, నాయకులు మరియు మీడియా మిత్రులు పోలీస్ వారికి సహకరించవలసిందిగా కోరుచున్నాము.
ఇట్లు
పి. వెంకటేశ్వర్లు
సి.ఐ, ఒంటిమిట్ట సర్కిల్.


