శ్రీ కాళహస్తి, జులై 24, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు దండి నరేంద్ర ముచ్చివోలు జెడ్పీహెచ్‌ఎస్, ఏర్పేడు హైస్కూల్ ప్లస్‌లలో నిర్వహించిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (PTM 4.0)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముచ్చివోలు పాఠశాలను జూనియర్ కళాశాలగా అభివృద్ధి చేయడం, ఏర్పేడులోని 12 ఎకరాల ప్రాంగణంలో బాలుర జూనియర్ కళాశాల మరియు సహ విద్యా డిగ్రీ కళాశాల ఏర్పాటు అవకాశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో జరుగుతున్న సంస్కరణలు, PTM 4.0 ప్రాముఖ్యతను తల్లిదండ్రులు, విద్యార్థులకు వివరిస్తూ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన నాణ్యత, విద్యార్థుల అభ్యాస పురోగతిపై నిరంతరం సమీక్షించాలని సూచించారు. విద్యార్థుల నమోదు పెరిగితే మౌలిక సదుపాయాలు మెరుగవుతాయని, విద్యార్థులు, తల్లిదండ్రులు యోగా, ధ్యానాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. దీక్ష, LEAP యాప్‌లను డిజిటల్ లెర్నింగ్ కోసం సమర్థవంతంగా వినియోగించుకునేలా నిత్యం కొంత సమయం స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంచాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఆహ్వానించిన ఉపాధ్యాయ బృందానికి, ఏర్పేడు పాఠశాల ఛైర్మన్ సురేంద్రకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, నవీన్, దివాకర్ పాల్గొన్నారు.

PTM 4.0తో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం-దండి నరేంద్ర