ఎం ఎస్ఎంఈ డైరెక్టర్ చినబాబు
పున్నమి ప్రతినిధి,రామచంద్రాపురం జూలై 24
విద్యా వ్యవస్థను పటిష్టం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డెవలప్మెంట్ డైరెక్టర్ చినబాబు అన్నారు. శుక్రవారం ఆయన రామచంద్రపురం మండలంలోని కుప్పం బాదూరు, జిహెచ్ఎస్ కమ్మపల్లి, కమ్మ కండ్రిగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మెగా పీటీఎం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల సమన్వయంతో ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం చేకూరిందని పేర్కొన్నారు. తల్లికి వందనం డబ్బులను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లీప్ యాప్ వంటి సాంకేతిక వినూత్న విధానాల ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి ప్రతిభను వెలికితీసేలా ప్రభుత్వం చర్యలను చేపట్టిందన్నారు. విద్యార్థులు చదువుతో పాటు నైతిక విలువలు పెంపొందించుకోవాలన్నారు, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై రోజూ దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ లు మార్కొండయ్య నాయుడు, జయవేలు, హెచ్ఎం సుజనీకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

