Friday, 24 July 2026
  • Home  
  • ఆంధ్ర వాళ్ళ కోసం… తెలంగాణ రైతులు భూములు స్వాహా.
- ఖమ్మం

ఆంధ్ర వాళ్ళ కోసం… తెలంగాణ రైతులు భూములు స్వాహా.

ఆంధ్ర వాళ్ళ కోసం… తెలంగాణ రైతులు భూములు స్వాహా. సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఎవరికోసం? ఈ ప్రాంత రైతులు, కాదా. ఓట్లు మావి లబ్ధి ఆంధ్ర వాళ్ళదా. జులై 24 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం: తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పి రైతుల శ్రేయస్సు మా ప్రధాన కర్తవ్యం అని చెప్పిన ప్రభుత్వాలు, దాటుడు ద్వారా ఆవలంబిస్తూ, సీతారామా లిఫ్ట్ కెనాల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ ప్రాంత రైతుల విలువైన భూములు తీసుకొని, ఇక్కడ రైతులకు సాగునీరు అందించకుండా, ఆంధ్ర రైతుల లబ్ధి కోసం తెలంగాణ రైతుల భూములను స్వాహా చేశారని ఆరోపణ బహిరంగగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను రాజులను చేస్తానని చెప్పి, నట్టేట ముంచిన ఘనత ఈ ప్రభుత్వంలో దక్కిందని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా మంత్రులు ఏజెన్సీ ప్రాంతాల రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ, పై ప్రాంతాన్ని నీళ్లు తీసుకెళ్లడం కోసం ఇక్కడ రైతుల భూములను ఆనాడు పోలీసులు రెవెన్యూ అధికారులు బలవంతంగా లాక్కొని, కాలవ నిర్మాణం జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న చెరువులకు చుక్కనీరు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని పలువురు రైతులు ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ధనాన్ని వెచ్చించి తెలంగాణ రైతుల లబ్ధి కోసం చేయవలసిన మంత్రులు ఎవరికి వారే తమ ప్రాంతాన్ని నీళ్లు తీసుకెళ్లాలని పోటీలు పడుతున్నారని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. ఓట్లు వేయించుకునే రోజు అన్ని కులాలు అన్ని మతాల వారి ఓట్లు దండుకొని, నేడు సాగునీరు కోసం ప్రాంతాలవారీగా విడగొట్టుకొని ఈ ప్రాంత రైతులను నట్టేట ముంచటం పాలకులకు ఎంతవరకు సబమని పలువురు ప్రశ్నిస్తున్నారు. పక్కనే సాగర్ కాలువ ఉన్నప్పటికీ కృష్ణాలో నీళ్ళు లేకపోవడం వల్ల ప్రస్తుతం గోదావరి జలాలను సీతారామ లెఫ్ట్ కెనాల్ ద్వారా సాగర్ కాలువకు నీళ్లు వదిలినప్పటికీ, ఏన్కూరు ఊర చెరువుకు చుక్క నీరు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పక్కనే ఉన్న గార్ల ఒడ్డు ఊర చెరువుకు పశువులు తాగడానికి కూడా నీళ్లు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రాంతంలో రైతులు వ్యవసాయం చేయాలంటే బోరు బావులు పై ఎంతకాలం ఆధారపడతారు అన్న విషయం పాలకుల కు తెలియదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంత రైతులకు గోదావరి జలాలు అందే విధంగా జిల్లాలోని మంత్రులు చర్యలు తీసుకోవాలని, సీతారామా లెఫ్ట్ కెనాల్ ద్వారా ఏన్కూరు ఊర చెరువు, గార్లఓడు ఊర చెరువులు నింపాలని, లేనిపక్షంలో ఈ ప్రాంత రైతులు ఆందోళన కూడా సిద్ధమయ్యే తరుణం ఆసన్నమైందని రైతులు సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు.

ఆంధ్ర వాళ్ళ కోసం… తెలంగాణ రైతులు భూములు స్వాహా.
సీతారామ ప్రాజెక్టు నిర్మాణం ఎవరికోసం?

ఈ ప్రాంత రైతులు, కాదా.

ఓట్లు మావి లబ్ధి ఆంధ్ర వాళ్ళదా.

జులై 24 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్

ఖమ్మం:
తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పి రైతుల శ్రేయస్సు మా ప్రధాన కర్తవ్యం అని చెప్పిన ప్రభుత్వాలు, దాటుడు ద్వారా ఆవలంబిస్తూ, సీతారామా లిఫ్ట్ కెనాల్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ ప్రాంత రైతుల విలువైన భూములు తీసుకొని, ఇక్కడ రైతులకు సాగునీరు అందించకుండా, ఆంధ్ర రైతుల లబ్ధి కోసం తెలంగాణ రైతుల భూములను స్వాహా చేశారని ఆరోపణ బహిరంగగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను రాజులను చేస్తానని చెప్పి, నట్టేట ముంచిన ఘనత ఈ ప్రభుత్వంలో దక్కిందని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా మంత్రులు ఏజెన్సీ ప్రాంతాల రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ, పై ప్రాంతాన్ని నీళ్లు తీసుకెళ్లడం కోసం ఇక్కడ రైతుల భూములను ఆనాడు పోలీసులు రెవెన్యూ అధికారులు బలవంతంగా లాక్కొని, కాలవ నిర్మాణం జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న చెరువులకు చుక్కనీరు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందని పలువురు రైతులు ప్రభుత్వ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయలు ధనాన్ని వెచ్చించి తెలంగాణ రైతుల లబ్ధి కోసం చేయవలసిన మంత్రులు ఎవరికి వారే తమ ప్రాంతాన్ని నీళ్లు తీసుకెళ్లాలని పోటీలు పడుతున్నారని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి. ఓట్లు వేయించుకునే రోజు అన్ని కులాలు అన్ని మతాల వారి ఓట్లు దండుకొని, నేడు సాగునీరు కోసం ప్రాంతాలవారీగా విడగొట్టుకొని ఈ ప్రాంత రైతులను నట్టేట ముంచటం పాలకులకు ఎంతవరకు సబమని పలువురు ప్రశ్నిస్తున్నారు. పక్కనే సాగర్ కాలువ ఉన్నప్పటికీ కృష్ణాలో నీళ్ళు లేకపోవడం వల్ల ప్రస్తుతం గోదావరి జలాలను సీతారామ లెఫ్ట్ కెనాల్ ద్వారా సాగర్ కాలువకు నీళ్లు వదిలినప్పటికీ, ఏన్కూరు ఊర చెరువుకు చుక్క నీరు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పక్కనే ఉన్న గార్ల ఒడ్డు ఊర చెరువుకు పశువులు తాగడానికి కూడా నీళ్లు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఈ ప్రాంతంలో రైతులు వ్యవసాయం చేయాలంటే బోరు బావులు పై ఎంతకాలం ఆధారపడతారు అన్న విషయం పాలకుల కు తెలియదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రాంత రైతులకు గోదావరి జలాలు అందే విధంగా జిల్లాలోని మంత్రులు చర్యలు తీసుకోవాలని, సీతారామా లెఫ్ట్ కెనాల్ ద్వారా ఏన్కూరు ఊర చెరువు, గార్లఓడు ఊర చెరువులు నింపాలని, లేనిపక్షంలో ఈ ప్రాంత రైతులు ఆందోళన కూడా సిద్ధమయ్యే తరుణం ఆసన్నమైందని రైతులు సూచనప్రాయంగా తెలియజేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.