Wednesday, 22 July 2026
  • Home  
  • అనుమతుల మేరకే భవన నిర్మాణాలు జరగాలి| కమిషనర్ వై.ఓ నందన్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అనుమతుల మేరకే భవన నిర్మాణాలు జరగాలి| కమిషనర్ వై.ఓ నందన్

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో టౌన్ ప్లానింగ్ సిబ్బందితో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశాల మేరకు పట్టణ ప్రణాళిక విభాగంలో భవన నిర్మాణ అనుమతులను సరళీకృతం చేశారనీ, అనుమతుల మేరకే భవన నిర్మాణాలు జరిగేలా నిరంతరం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పర్యవేక్షించాలని సూచించారు. ఎల్.ఆర్.ఎస్ పథకం అమలుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని, పథకం ద్వారా కలిగే లబ్ధిని గురించి విస్తృతస్థాయిలో ప్రజలకు అవగాహన, ప్రచారం కల్పించాలని సూచించారు. ప్లానింగ్ కార్యదర్శుల లాగిన్లలో ఉన్న ఎల్.ఆర్.ఎస్ పాటర్న్స్ పరిశీలించి వెంటనే తదుపరి అనుమతుల కొరకు అధికారులకు పంపవలసిందిగా ఆదేశించారు. విధుల నిర్వహణలో ప్రతి ఒక్కరు నిబద్ధత పాటించి టౌన్ ప్లానింగ్ విభాగం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచేందుకు ప్రతి ఒక్క టౌన్ ప్లానింగ్ విభాగం అధికారి, సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శి కృషి చేయాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నక్ష ప్రాజెక్టు పనుల పురోగతిని మరింత వేగవంతం చేసి నిర్దేశించిన సమయంలో గా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. నక్ష ప్రాజెక్టు నిర్వాహణకు కేటాయించిన సిబ్బంది అందరూ విధుల నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించి ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కమిషనర్ సూచించారు. ఈ సమావేశంలో నెల్లూరు నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాథరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ లు వేణు, సతీష్, సూపరిండెంట్ ప్రవీణ్ కుమార్, టీ.పీ.బి.వోలు, ప్లానింగ్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో టౌన్ ప్లానింగ్ సిబ్బందితో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశాల మేరకు పట్టణ ప్రణాళిక విభాగంలో భవన నిర్మాణ అనుమతులను సరళీకృతం చేశారనీ, అనుమతుల మేరకే భవన నిర్మాణాలు జరిగేలా నిరంతరం టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, వార్డు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులు పర్యవేక్షించాలని సూచించారు.

ఎల్.ఆర్.ఎస్ పథకం అమలుకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని, పథకం ద్వారా కలిగే లబ్ధిని గురించి విస్తృతస్థాయిలో ప్రజలకు అవగాహన, ప్రచారం కల్పించాలని సూచించారు.

ప్లానింగ్ కార్యదర్శుల లాగిన్లలో ఉన్న ఎల్.ఆర్.ఎస్ పాటర్న్స్ పరిశీలించి వెంటనే తదుపరి అనుమతుల కొరకు అధికారులకు పంపవలసిందిగా ఆదేశించారు. విధుల నిర్వహణలో ప్రతి ఒక్కరు నిబద్ధత పాటించి టౌన్ ప్లానింగ్ విభాగం సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచేందుకు ప్రతి ఒక్క టౌన్ ప్లానింగ్ విభాగం అధికారి, సచివాలయ ప్లానింగ్ అండ్ రెగ్యులైజేషన్ కార్యదర్శి కృషి చేయాలని సూచించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నక్ష ప్రాజెక్టు పనుల పురోగతిని మరింత వేగవంతం చేసి నిర్దేశించిన సమయంలో గా పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. నక్ష ప్రాజెక్టు నిర్వాహణకు కేటాయించిన సిబ్బంది అందరూ విధుల నిర్వహణలో నిబద్ధతతో వ్యవహరించి ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు కృషి చేయాలని కమిషనర్ సూచించారు.

ఈ సమావేశంలో నెల్లూరు నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాథరావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ లు వేణు, సతీష్, సూపరిండెంట్ ప్రవీణ్ కుమార్, టీ.పీ.బి.వోలు, ప్లానింగ్ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.