Tuesday, 21 July 2026
  • Home  
  • కేజీబీవీ ఆనందపురంలో ఘనంగా ప్రపంచ జీవన నైపుణ్యాల దినోత్సవం నిర్వహణ
- విశాఖపట్నం

కేజీబీవీ ఆనందపురంలో ఘనంగా ప్రపంచ జీవన నైపుణ్యాల దినోత్సవం నిర్వహణ

విశాఖపట్నం,ఆనందపురం (పున్నమి ప్రతినిధి) కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ), ఆనందపురంలో ప్రపంచ జీవన నైపుణ్యాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల్లో జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో పలు కార్యక్రమాలను నిర్వహించారు. విద్యార్థినులు లైఫ్ స్కిల్స్ Skits ను ప్రదర్శించి వాటి వినియోగాన్ని వివరించారు. అలాగే జీవన నైపుణ్యాలు, వృత్తి విద్య అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. చిత్రలేఖన పోటీలు నిర్వహించగా విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. పోటీల్లో మరియు ప్రాజెక్టుల ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి D. చంద్రకళ మాట్లాడుతూ, జీవన నైపుణ్యాలు విద్యార్థుల వ్యక్తిగత, సామాజిక, వృత్తిపరమైన జీవితాల్లో ఎంతో కీలకమైనవని తెలిపారు. సమస్య పరిష్కార సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం, సంభాషణా నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం వంటి జీవన నైపుణ్యాలు ప్రతి విద్యార్థికి అవసరమని వివరించారు. అలాగే పాఠశాలలో అమలు చేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ వృత్తి విద్య ద్వారా విద్యార్థినులు ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వంటి అంశాల్లో ప్రాయోగిక నైపుణ్యాలు అలవర్చుకుంటారని, ఇవి భవిష్యత్తులో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొని ప్రపంచ జీవన నైపుణ్యాల దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు.

విశాఖపట్నం,ఆనందపురం (పున్నమి ప్రతినిధి) కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (కేజీబీవీ), ఆనందపురంలో ప్రపంచ జీవన నైపుణ్యాల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల్లో జీవన నైపుణ్యాలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో పలు కార్యక్రమాలను నిర్వహించారు.
విద్యార్థినులు లైఫ్ స్కిల్స్ Skits ను ప్రదర్శించి వాటి వినియోగాన్ని వివరించారు. అలాగే జీవన నైపుణ్యాలు, వృత్తి విద్య అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. చిత్రలేఖన పోటీలు నిర్వహించగా విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు.
పోటీల్లో మరియు ప్రాజెక్టుల ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు బహుమతులు అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి D. చంద్రకళ మాట్లాడుతూ, జీవన నైపుణ్యాలు విద్యార్థుల వ్యక్తిగత, సామాజిక, వృత్తిపరమైన జీవితాల్లో ఎంతో కీలకమైనవని తెలిపారు. సమస్య పరిష్కార సామర్థ్యం, నిర్ణయాలు తీసుకునే నైపుణ్యం, సంభాషణా నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం వంటి జీవన నైపుణ్యాలు ప్రతి విద్యార్థికి అవసరమని వివరించారు.
అలాగే పాఠశాలలో అమలు చేస్తున్న ఫుడ్ ప్రాసెసింగ్ వృత్తి విద్య ద్వారా విద్యార్థినులు ఆహార పదార్థాల తయారీ, నిల్వ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ వంటి అంశాల్లో ప్రాయోగిక నైపుణ్యాలు అలవర్చుకుంటారని, ఇవి భవిష్యత్తులో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొని ప్రపంచ జీవన నైపుణ్యాల దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.