తిరుపతి జిల్లా వాకాడు మండలం జి సి ఎఫ్ – ఈ సి ఆర్ ఐ సి సి ప్రాజెక్టు ఆధ్వర్యంలో వాకాడలో ఈరోజు సామర్ధ్యభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ( స్పేర్ ) మరియు మత్స్య శాఖల సంయుక్త భాగస్వామ్యంతో స్థానిక స్పేర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి వాకాడు ఎంపీడీవో స్థాయి ప్రసాద్ అధ్యక్షత వహించారు.
ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణం మార్పులు ప్రభావంతో ఉపాధి దెబ్బతిన్నకుండా, స్థిరమైన ఆదాయం మార్గాలను అన్వేషించడమే లక్ష్యంగా ఈ శిక్షణను చేపట్టారు. ఇందులో భాగంగా తీరప్రాంత మహిళలకు సముద్రపు శైవలాల (సి విడ్ ) సాగు, అలంకార చేపల పెంపకం ( ఆర్నమెంటల్ ఫిషరీస్ ) వంటి వాతావరణ అనుకూల మత్స్య దార జీవనోపాదులపై సమగ్రమైన అవగాహన కల్పించారు.
కేవలం సాగు పద్ధతులే కాకుండా విలువ ఆధారిత వ్యాపార అవకాశాలు, మార్కెట్ అనుసంధానం మరియు సమర్థవంతమైన వ్యాపార నిర్వహణపై సాంకేతిక పరిజ్ఞానాన్ని నిపుణులు అందించారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రాజెక్టు పరిధిలోని 60 మంది మహిళల లబ్ధిదారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో సాయి ప్రసాద్ మాట్లాడుతూ, తీర ప్రాంత మహిళలు ఇటువంటి వినూత్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదగడమే కాకుండా, వాతావరణ మార్పుల సవాళ్లను సామర్థ్యం గా ఎదుర్కొనే శక్తిని పొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
వాకాడు తాసిల్దార్ సయ్యద్ ఇక్బాల్ మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖల సమన్వయంతో మహిళలకు నైపుణ్య అభివృద్ధి, వ్యవస్థాపక తపై కల్పిస్తున్న ఈ ప్రోత్సహం అభినందనీయమని పేర్కొన్నారు.
జి సి ఎఫ్ – ఈ సి ఆర్ ఐ సి సి ప్రాజెక్ట్ కు ద్వారా చేపట్టిన ఈ కార్యక్రమం, తీర ప్రాంత మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరించడంతోపాటు గ్రామీణ అభివృద్ధికి ఎంతో గాను దోహదపడుతుందని వక్తులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఎఫ్ పిఓ సభ్యుడు రామ్ అన్నయ్య రీడ్స్ సంస్థ కోఆర్డినేటర్ ఎం.రామ్ లాల్, హైపర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ ఎన్.వి.ఆర్ గణేష్, సెర్ప్ ఏపిఎం పోలమ్మ, జిసిఎఫ్- ఈ సి ఆర్ ఐ సి సి జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ ఎన్జ. జస్వంత్త్, కమ్యూనిటీ కోఆర్డినేటర్లు( సీసీలు) విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు (విఓఏలు )పాల్గొన్నారు.



