ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 18 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే వంతెన కింద శనివారం ఉదయం రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. విజయవాడ–చెన్నై రైల్వే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. తెల్లటి టీ-షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న మనుబోలు ఎస్సై మహమ్మద్ హానీఫ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అనంతరం ఎస్సై హరి చందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

రైలు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 18 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే వంతెన కింద శనివారం ఉదయం రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. విజయవాడ–చెన్నై రైల్వే మార్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. తెల్లటి టీ-షర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న మనుబోలు ఎస్సై మహమ్మద్ హానీఫ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అనంతరం ఎస్సై హరి చందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

